తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరీంనగర్‌లో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం'

కరీంనగర్​లోని పలు డివిజన్లలో మంత్రి గంగుల కమలాకర్​ మొక్కలు పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ... ఆరు మొక్కలు అందించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్‌లో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.

minister gangula kamalaker distributed plants in karimnagar
minister gangula kamalaker distributed plants in karimnagar

By

Published : Jul 19, 2020, 5:35 PM IST

హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్​లోని 40వ డివిజన్ వివేకానందపురి కాలనీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేశారు. కరీంనగర్ నర్సరీలో అందుబాటులో లేకున్నప్పటికీ... ఆదిలాబాద్ జిల్లా కడెం నుంచి మొక్కలను తెప్పించి అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి పిల్లలకు ఇస్తే అవి కరిగిపోతాయి తప్ప... అదే మొక్కలు నాటితే సమతుల్యమైన వాతావరణాన్ని అందించిన వాళ్ళమవుతామని వివరించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనిపించినా మొక్కలు నాటి... హరిత కరీంనగర్ జిల్లాగా మార్చాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మంత్రితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి, మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ భూమగౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details