"తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకున్నాం. కాంగ్రెస్, భాజపాకు మళ్లీ ఓటేసి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుందామా..? భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. భాజపాలో ఇప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ముగ్గురు మాత్రమే అవుతారు. వాళ్లతో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచించని ఈటల రాజేందర్... ఇప్పుడు ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర చేస్తున్నారు." -గంగుల కమలాకర్, మంత్రి
Minister Gangula: 'సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్' - మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. సీటీ సెంట్రల్ హాల్‌లో పద్మశాలి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పద్మశాలి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ఎకరం స్థలం, రూ.కోటి నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను పద్మశాలి సంఘం నాయకులకు అందించారు.

minister gangula kamalakar visited in huzurabad
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్