కరోనా కల్లోలంతో కరీంనగర్ బస్టాండ్‌ను కాస్త.. ఇప్పుడు కూరగాయల మార్కెట్‌గా మార్చారు. మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసేందుకు బస్టాండ్‌ను మార్కెట్‌గా మార్చినట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మార్కెట్‌గా తీర్చిదిద్దిన ప్రాంతాన్ని మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో పాటు.. ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
కూరగాయల మార్కెట్‌గా మారిన కరీంనగర్ బస్టాండ్ - మార్కెట్‌గా మారిన కరీంనగర్ బస్టాండ్
వేగంగా విస్తరిస్తున్న కరోనా నియంత్రణ కోసం సామాజిక దూరంపైనే మంత్రులు, అధికారులు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం వచ్చేటప్పుడు గుమిగూడకుండా ఉండేందుకు కరీంనగర్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కూరగాయల మార్కెట్‌గా మారిన కరీంనగర్ బస్టాండ్
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రజలంతా సహకరిస్తున్నారని.. ఏఏ ప్రాంతాల్లో ఉన్నవారికి ఆయా ప్రాంతాల్లోనే మార్కెట్లు ఏర్పాటు చేసినందున గుంపులు గుంపులుగా వెళ్లొద్దని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...