రాజకీయాల్లో ఉన్నంత కాలం తెరాసలోనే కొనసాగుతానని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ తెరాస పార్టీకి రాజీనామా చేసి.. భాజపాలోకి చేరతారని ప్రచారం చేయడంతో మంత్రి అప్రమత్తమయ్యారు. కార్పొరేటర్లతో మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అప్రమత్తమైన మంత్రి గంగుల.. కారణం అదేనా! - కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్
స్వార్థపరులే పార్టీ వీడుతారు తప్ప నిజమైన కార్యకర్తలు పార్టీని వీడరని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ తెరాస పార్టీకి రాజీనామా చేసి.. భాజపాలోకి చేరతారని ప్రచారం చేయడంతో మంత్రి కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం జరిపారు.
అప్రమత్తమైన మంత్రి గంగుల.. కారణం అదేనా!
అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని మంత్రి గంగుల పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు తెరాస పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లపాటు కేసీఆర్ అద్భుతంగా పరిపాలిస్తారని చెప్పారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయని.. అక్కడి పరిస్థితులకు రాష్ట్ర రాజకీయాలను జోడించలేమన్నారు.
ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ, రాబడి
TAGGED:
అప్రమత్తమైన మంత్రి గంగుల