కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని కరీంనగర్‌లో బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నివాళులు అర్పించారు. నగరంలోని బైపాస్ వద్ద ఆయన విగ్రహానికి మంత్రి కమలాకర్‌తో కలిసి మేయర్ సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి పూలమాలలు వేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి మంత్రి గంగుల కమలాకర్ నివాళి - మంత్రి గంగుల కమలాకర్ తాజా వార్తలు
కరీంనగర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి మంత్రి గంగుల కమలాకర్ నివాళి
దేశం కోసం తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించారు. స్వరాష్ట్రం కోసం తన మంత్రి పదవిని సైతం వదిలిపెట్టారని కొనియాడారు.
ఇదీ చదవండి:కొండా లక్ష్మణ్ బాపూజీ ఎందరికో స్ఫూర్తి: సీఎం కేసీఆర్