తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన మంత్రి గంగుల - తెలంగాణ తాజా వార్తలు

ప్రజలందరూ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ చీరలను అందిస్తోందని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్‌ కిసాన్‌నగర్‌లో మేయర్ సునీల్‌రావుతో కలిసి చీరల పంపిణీని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన మంత్రి గంగుల
బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన మంత్రి గంగుల

By

Published : Oct 9, 2020, 3:59 PM IST

కరీంనగర్​లోని కిసాన్​నగర్​లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్​ సునీల్​రావు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలను అందిస్తూనే... మరోవైపు నేతన్నలకు చేయూతనిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు.

గత ఐదేళ్లుగా.. సిరిసిల్ల నుంచి చీరలు కొనుగోలు చేయడం వల్ల నేతన్నలు ఆత్మగౌరవంగా బతుకుతున్నారన్నారు. దాదాపు 4-5 రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి మహిళకు చీర అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రేషన్ దుకాణాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీర ఇస్తామన్నారు. దాదాపు 275 డిజైన్లతో 280 రంగుల్లో చీరలు తయారు చేయించారని తెలిపారు.

ఇదీ చూడండి:నాలెడ్జ్​ అప్​గ్రేడ్​​తో ఉద్యోగ భద్రత: జయేశ్ రంజన్

ABOUT THE AUTHOR

...view details