ధాన్యం తేమలేకుండా తీసుకొస్తే కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సంయుక్త పాలనాధికారి శ్యాంప్రసాద్‌తో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ధాన్యం దిగుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ధాన్యం కోయడంతోటే నేరుగా మార్కెట్‌కు తరలించడం వల్ల ఇతర రైతులకు ఇబ్బంది కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న ధాన్యంలో తేమశాతం 25వరకు ఉంటోందని... అలా కాకుండా తేమ 17శాతం వచ్చే వరకు ఎండపెట్టి తీసుకొస్తే వెంటనే మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని మంత్రి గంగుల వివరించారు. అవసరమైతే ధాన్యం ఆరబెట్టడానికి రాయితీపై టార్పాలిన్లు కొనుగోలు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఎట్టి పరిస్థితిలోను కొనుగోలు చేయబోమని, అలాంటి ధాన్యాన్ని అరికట్టడానికి ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గంగుల - paddy
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్‌కు రైతులు తీసుకువస్తున్న ధాన్యంలో అధిక తేమశాతం ఉంటోందని... ఎండబెట్టి తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గంగుల