తెలంగాణలో ఏ ఎన్నికలైనా తెరాసదే విజయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సహకార ఎన్నికల్లో గెలుపొందిన వారిని కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరాన్ని పచ్చదనంతో నింపుతామన్నారు. ఒకేరోజు 6,666 మొక్కలను నాటుతామని ఆయన చెప్పారు.
'కేసీఆర్ పుట్టినరోజున కరీంనగర్‌ను పచ్చదనంతో నింపుతాం' - karimnagar news
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో 6,666 మెుక్కలను నాటుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా తెరాసదే విజయమని పేర్కొన్నారు.
'కేసీఆర్ పుట్టినరోజున కరీంనగర్‌ను పచ్చదనంతో నింపుతాం'
ఈనెల 18న కరీంనగర్‌లోని ఐటీ టవర్‌ను ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గంగుల తెలిపారు. ఐటీ టవర్ ప్రారంభం అనంతరం కేటీఆర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సమీక్షా సమావేశం నిర్వహిస్తారని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పట్టణ ప్రగతి అజెండాగా రేపు కేబినెట్ భేటీ