తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే జరుపుతామని బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియంలో ఎంతమంది ప్రజలు వీక్షించగలుగుతారు... ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందో మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతిలతో కలిసి చర్చించారు.
బతుకమ్మ.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: గంగుల - బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగైన బతుకమ్మ వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూనే నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రావణదహనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
బతుకమ్మ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి గంగుల
రావణదహనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ చరిత్రని వివరించే లేజర్ షో ప్రదర్శన స్టేడియంలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనా నిబంధనలతో బతుకమ్మ సంబరాలు