తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారుల్లో పట్టుదలుంటేనే హరిత వనం సాధ్యం' - మంత్రి గంగుల కమలాకర్

కాంక్రీటు నగరాన్ని హరిత వనం​గా మార్చేందుకు కృషి చేసిన సీపీ కమలాసన్​రెడ్డిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. సర్య్కూలర్ జారీ చేసి మొక్కలు నాటమంటే మొక్కుబడిగా చేస్తారని, అధికారులకు పట్టుదల ఉంటేనే పచ్చదనం సాధ్యమని అన్నారు. కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండో మియావాకి ప్రాజెక్ట్​ను మేయర్, సీపీలతో కలిసి మంత్రి ప్రారంభించారు.

minister gangula kamalakar reddy on plantation in karimnagar
'అధికారుల్లో పట్టుదలుంటేనే హరిత వనం సాధ్యం'

By

Published : Sep 30, 2020, 11:49 AM IST

ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినంత మాత్రాన మొక్కలు పెంచడం జరిగిపోదని... అమలు చేసే అధికారుల్లో పట్టుదల, ఆసక్తి ఉంటేనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌ పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండో మియావాకి ప్రాజెక్టును మేయర్ సునీల్‌రావు, సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

'అధికారుల్లో పట్టుదలుంటేనే హరిత వనం సాధ్యం'

ఇప్పటికే ఒక మియావాకి ప్రాజెక్టులో మొక్కలు నాటే ప్రక్రియ విజయవంతం అయ్యిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి మొక్కలు నాటారు.

"ఒక ఎకరం 14గుంటల్లో దాదాపు 15వేల మొక్కలు నాటడమే కాకుండా... వాటిని సంరక్షిస్తూ సీపీ కమలాసన్‌‌రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఒకవైపు శాంతిభద్రతలను సంరక్షిస్తూనే మరోవైపు చెట్ల పెంపకానికి సీపీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. పచ్చని వనాన్ని కరీంనగర్ ప్రజలకు ఒక ఆస్తిగా అందించారు."

-గంగుల కమలాకర్‌, బీసీ సంక్షేమశాఖమంత్రి

ABOUT THE AUTHOR

...view details