కరీంనగర్ జిల్లాలో తక్కువగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటీ పోలీస్ శిక్షణా కేంద్రంలో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ శోభారాణి కలిసితో మియావాకి పద్దతిలో మొక్కలు నాటారు. పోలీస్ శాఖ కేవలం శాంతి భద్రతలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
అటవీ విస్తీర్ణం పెంచేందుకు పకడ్బందీ ప్రణాళిక: మంత్రి గంగుల - కరీంనగర్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కమలాకర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిటీ పోలీస్ శిక్షణా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్.. ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ శోభారాణి కలిసితో మియావాకి పద్దతిలో మొక్కలు నాటారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
అటవీ విస్తీర్ణం పెంచేందుకు పకడ్బందీ ప్రణాళిక: మంత్రి గంగుల
గతంలో మియావాకి పద్దతిన నాటిన మొక్కలు ఇప్పుడు అడవిలా రూపుదిద్దుకున్నాయన్నారు. యాదాద్రి తరహాలో మొక్కలు నాటాలని సూచిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ శోభారాణి అన్నారు. కరీంనగర్‌లో మరో అడవి రూపకల్పనకు నాంది పలకడం అభినందనీయమన్నారు.
ఇవీ చూడండి:'దాసరి' కుటుంబంలో ఆస్తి తగాదాలు