తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్... నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం శాతవాహన విశ్వవిద్యాలయం ఆవరణలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
అపర భగీరథుడు మా కేసీఆర్: మంత్రి గంగుల - ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వార్తలు
కేసీఆర్ 67వ జన్మదిన వేడుకలను... తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్‌తో కలిసి మొక్కలు నాటారు.
అపర భగీరథుడు మా కేసీఆర్: మంత్రి గంగుల
అపర భగీరథుడు, రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారించిన మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి పొగిడారు. ముఖ్యమంత్రి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి:వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్