తెలంగాణ ఆవిర్భవించకపోతే తెలంగాణ మరో సోమాలియా రాష్ట్రంగా మారేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ పుట్టడం తెలంగాణ ప్రజల అదృష్టమని... ఆయన పుట్టిన గడ్డమీద తాను పుట్టడం వరంగా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్తోపాటు కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దేశం ఆకలి తీర్చే విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. సీఎం కేసిఆర్ దైవస్వరూపడని.. తెలంగాణ ఆస్తి అని మంత్రి అభివర్ణించారు.. ఆత్మహత్యల తెలంగాణను ఆరేళ్లలో సస్యశ్యామల రాష్ట్రంగా అభివృద్ధి చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని ఆయన పేర్కొన్నారు.