కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆర్టీసీ వర్క్ షాప్ ముందు మొక్కలు నాటి ప్రారంభించారు. కార్యక్రమంలో నాటిన మొక్కలన్నింటికీ సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 313 గ్రామపంచాయతీలో 55 లక్షలు మొక్కలు పంపిణీకి అన్ని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు: మంత్రి గంగుల - తెలంగాణలో ఆరోవిడత హరితహారం
ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నగరవాసులను కోరారు.
పచ్చని చెట్లు... ప్రగతికి మెట్లు
రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు మొక్కలు నాటాలని కోరారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన సూచించారు.