కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వెంటనే సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పీవీ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్క్‌లో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్తరూపు తెచ్చిన మహోన్నతుడు పీవీ: గంగుల - కరీంనగర్‌లో పీవీ జయంతి వేడుకల్లో మంత్రి గంగుల
పీవీ నరసింహారావు.. గొప్ప రాజకీయ నేత, పండితుడని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పీవీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్‌లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
కరీంనగర్‌లో ఘనంగా పీవీ జయంతి వేడుకలు
జిల్లా కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ కమిషనర్ సునీల్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో పీవీ సేవలను మంత్రి గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీవీ జయంతి వేడుకల్లో అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాజకీయ కక్షలు కాదు... రాజకీయ విజ్ఞత ప్రదర్శించండి: ఎంపీ రేవంత్రెడ్డి