హరితహారంలో భాగంగా కరీంనగర్లో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతితో కలిసి అల్గునూరులో మొక్కలు నాటారు.
అనంతరం భగత్‌నగర్ కూడలిలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సులభ్ కాంప్లెక్స్‌ల సదుపాయం లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.