రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని... పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుబాటులో ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, నిరుద్యోగులు వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. కరీంనగర్‌లో మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు: గంగుల - Karimnagar district latest news
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏ దేశంలోనూ కుదరదని... పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలు చాలా ఉన్నాయని, నిరుద్యోగులు వాటిని వినియోగించుకోవాలని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో కరీంనగర్‌లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు.
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు: గంగుల
జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారు జిల్లాలోనే కాకుండా హైదరాబాద్‌లోనూ ప్రైవేటు కంపెనీలలో పని చేయాల్సి ఉంటుందని గంగుల అన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే జాబ్ మేళాలను నిరుద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. ఆశించిన దాని కంటే ఎక్కువ మంది నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'మా కూమార్తెను అపహరించారు.. చర్యలు తీసుకోండి'
Last Updated : Feb 20, 2021, 7:45 PM IST