తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు తనకు పండుగ రోజని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై ఆయన జన్మించడం ప్రజల అదృష్టమని కొనియాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో మేయర్ సునీల్‌రావుతో కలిసి.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.
కారణజన్ముడు
కులమతాలకు అతీతంగా కేసీఆర్ పుట్టినరోజును ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాల్సిన రోజని గంగుల అన్నారు. అందువల్లనే తాను కొత్త బట్టలు కుట్టించుకున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ కారణజన్ముడని.. తెలంగాణలో ఆయన పుట్టడం.. ఆ గడ్డపైనే తాను పుట్టడం తన పూర్వ జన్మ సుకృతమని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే బీడుభూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం అందరికీ మొక్కలు పంపిణీ చేశారు.
కేసీఆర్ జననం.. తెలంగాణ ప్రజలకు వరం: గంగుల ఇదీ చదవండి:వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్