భాజపా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే ఆర్టీసీ కార్మికులను వాడుకుంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌లో ఆరోపించారు. సమ్మెను రాజకీయంగా వాడుకోవడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులు విపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. రాజకీయ లబ్ధికోసమే ఆర్టీసీ కార్మికులను విపక్షలు రెచ్చగొడుతన్నాయని దుయ్యబట్టారు. కార్మికులు మొదట అడిగిన 26 డిమాండ్లను మర్చిపోయి కేవలం విలీనం మాత్రమే అడుతున్నారన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని తామేప్పుడు చెప్పలేదని మంత్రి గంగుల అన్నారు.
కార్మికులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయి...: మంత్రి గంగుల
రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు కార్మికులను రెచ్చిగొడుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. సమ్మెను రాజకీయంగా వాడుకోవటం సరికాదన్నారు. విపక్షాల మాటలు నమ్మి కార్మికులు మోసపోకూదని సూచించారు.
MINISTER GANGULA KAMALAKAR ON OPPOSITION ON TSRTC STRIKE