తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసినా సరే ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ధైర్యంగా ఉండండి: గంగుల - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలుచేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసినా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. ఈ సారి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

minister-gangula-kamalakar-on-crops
తడిసినా సరే ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ధైర్యంగా ఉండండి: గంగుల

By

Published : May 19, 2021, 2:05 PM IST

కరోనా సాకుతో దేశంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అయితే రాష్ట్రంలో మాత్రం కొవిడ్‌ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని వెల్లడించారు. ఈసారి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. మద్ధతు ధర రూ.1,886కు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

ఇప్పటికే 50శాతం కొనుగోళ్లు పూర్తైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,850 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని... కొనుగోళ్లు పూర్తి చేసి 150 కేంద్రాలు మూసివేశామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరత వేధిస్తోందని... లాక్‌డౌన్‌ వల్ల బిహార్‌ కూలీలు వెళ్లిపోయారని మంత్రి వెల్లడించారు. కొనుగోలు చేసినంత మేరకు ఎఫ్‌సీఐ తరలించడం లేదని తెలిపారు. ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ధాన్యం తడిసినా సరే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

తడిసినా సరే ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ధైర్యంగా ఉండండి: గంగుల

ఇదీ చూడండి:కొవిడ్​ చికిత్స నుంచి రెమ్​డెసివిర్​ తొలగింపు!

ABOUT THE AUTHOR

...view details