తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​లో కరీంనగర్​కు మరోసారి పెద్దపీట: గంగుల - కరీంనగర్​ వార్తలు

బడ్జెట్​లో కరీంనగర్​ జిల్లాకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి గంగుల కమలాకర్​ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

minister gangula kamalakar on budget
బడ్జెట్​లో కరీంనగర్​కు మరోసారి పెద్దపీట: గంగుల

By

Published : Mar 18, 2021, 6:41 PM IST

మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటుకు బడ్జెట్​లో రూ.100కోట్లు కేటాయించడంపట్ల మంత్రి గంగుల కమలాకర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్​లో కేసీఆర్​ను కలిసి కరీంనగర్​ జిల్లాకు మరోసారి బడ్జెట్​లో పెద్దపీట వేశారని ఆనందం వ్యక్తం చేశారు. మానేరు నదిపై ఇప్పటికే 5 చెక్ డ్యామ్​ల నిర్మాణం కోసం రూ.87.90 లక్షల నిధులు మంజూరు అయ్యాయని... పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

నిర్మాణం పూర్తయితే కేబుల్ బ్రిడ్జ్ వరకు మానేరు నది తీరం రూపురేఖలు మారతాయని మంత్రి పేర్కొన్నారు. మానేరు నది పొడవునా ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని వెల్లడించారు. కేసీఆర్ కృషితో కరీంనగర్ దేశంలోనే ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు.

ఇదీ చూడండి:బడ్జెట్​​పై హర్షం వ్యక్తం చేసిన మంత్రులు కొప్పుల, నిరంజన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details