వర్షాకాలం సమీపిస్తుండడం వల్ల కరీంనగర్లో నిర్మాణంలో ఉన్న తొమ్మిది రహదారులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై జిల్లా కలెక్టర్, నగర మేయర్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలి: మంత్రి గంగుల - కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు తాజా వార్తలు
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న 9 రహదారులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. నగర స్మార్మ్ సిటీ పనులపై మంత్రి సమీక్షించారు. రోడ్ల విస్తరణలో మాస్టర్ ప్లాన్‌లోని వెడల్పు ప్రకారం నిర్మాణాలు చేపట్టారా అని అధికారులను ప్రశ్నించారు.
రోడ్ల విస్తరణలో మాస్టర్ ప్లాన్‌లో ఉన్న వెడల్పు ప్రకారం నిర్మాణాలు చేపట్టారా అని మంత్రి ప్రశ్నించారు. రోడ్డు అలైన్ మెంట్ చేసేటప్పుడు రహదారి చెడిపోకుండా చూడాలని సూచించారు. కరీంనగర్లో 1997 సంవత్సరంలో మొదటిసారి మాస్టర్ ప్లాన్ అమలు చేశారని, అప్పటి ప్రజలకు అనుకూలంగా రోడ్ల విస్తరణ చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ సిటీలో రోడ్లను విస్తరిస్తున్నందున సెట్ బ్యాక్ వదలని నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించాలన్నారు. వాటిని సెట్ బ్యాక్ చేసి రోడ్డు విస్తరణ పనుల్లో కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు సహకరించాలని మంత్రి గంగుల పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్