స్వశక్తి మహిళలు స్వయం ఉపాధిలో నైపుణ్యతతో రాణిస్తూ ఆర్థికంగా కుటుంబానికి కలిసి వచ్చేలా అడుగులు వేయడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్‌లో మహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసుకున్న చట్నీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. మహిళలు వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా పోటీపడుతూ ఆర్థికంగా ముందంజలో ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. వినూత్న ఆలోచనతో చట్నీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొని, లయన్స్ క్లబ్ సహాయంతో యాప్ ద్వారా అమ్మకాలు చేయడం అభినందనీయమన్నారు.
అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ముందంజలో మహిళలు: గంగుల - గునుకుల కొండాపూర్‌లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటన
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్‌లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. మహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన చట్నీ ప్రాసెసింగ్ యూనిట్‌ను... స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి ప్రారంభించారు.
అంతర్జాతీయంగా అమ్మకాలు విస్తృతమయ్యేలా క్వాంటిటీ, క్వాలిటీలో మెలకువలు పాటించాలని మంత్రి సూచించారు. స్వయం ఉపాధి పనుల్లో జిల్లాకే గునుకుల కొండాపూర్ ఆదర్శంగా నిలిచేలా విభిన్న రకాల పదార్థాలను తయారు చేసి అమ్మకాలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మానకొండూరు నియోజకవర్గంలో భారీ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, తుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణ రావు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ హరి ప్రసాద్, ఏపీయం లావణ్య, లయన్స్ క్లబ్ గవర్నర్లు, మహిళా సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వ్యవసాయ రంగానికి పెద్దపీట: నిరంజన్ రెడ్డి
TAGGED:
మంత్రి పర్యటన