రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉన్నది వాస్తవమేనని.. దానిని అధిగమిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ సునీల్‌రావుతో కలిసి భూమి పూజ చేశారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల - Minister Gangula Kamalakar latest news
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
గత పాలకులు కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేయలేకపోయారని మంత్రి గంగుల విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి ఆటంకాలను తొలగించామని తెలిపారు. నగరంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలున్నా వాటిని కాపాడి.. ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా నగరాన్ని ఇప్పటికే 60 శాతం అభివృద్ధి చేశామన్న ఆయన.. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గందె మాధవి, మహేశ్, బోనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఆక్సిజన్, టీకాలు, రెమ్‌డెసివిర్ విషయంలో కేంద్రం వివక్ష'