కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్కాపురి కాలనీలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్‌రావుతో కలిసి రూ.50 లక్షలతో నిర్మాణం చేపట్టిన పార్కులను ప్రారంభించారు.
MINISTER GANGULA:'తెలంగాణలో అభివృద్ధికి కొదువలేదు' - karimnagar district latest news
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధికి కొదువ లేదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
'తెలంగాణలో అభివృద్ధికి కొదువలేదు'
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధికి కొదవలేదని మంత్రి గంగుల పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులిచ్చే వారు కాదని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేకంగా సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో 14 పార్కుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడు: మంత్రి శ్రీనివాస్ గౌడ్