కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ డెయిరీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర పాలక సంస్థ మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలో కరీంనగర్ డెయిరీకి మంచి గుర్తింపు ఉందని మంత్రి అన్నారు. ఈ మేరకు డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్‌రావును ఆయన అభినందించారు. 22 సంవత్సరాల నుంచి డెయిరీ అద్భుత ఫలితాలు సాధిస్తుందని కొనియాడారు. ఇప్పటి వరకు సుమారు 70వేల రైతులు ఈ డెయిరీకి పాలు పోస్తున్నారని తెలిపారు.
'కరీంనగర్ డెయిరీ.. పెట్రోల్లోనూ తన మార్క్ చూపించాలి' - కరీంనగర్ డెయిరీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్
కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పాలసేకరణలో నాణ్యత ప్రమాణాలను పాటించినట్లుగానే పెట్రోల్ విక్రయంలోను పాటించాలని మంత్రి కోరారు.
మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్
పాలసేకరణలో నాణ్యత, ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగుతున్న డెయిరీ.. పెట్రోల్‌ను విక్రయించడంలోను అదే పద్ధతి పాటించాలని మంత్రి గంగుల కోరారు. తద్వారా కరీంనగర్ పాలక మండలి సత్ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:పతంగోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Last Updated : Jan 14, 2021, 3:38 PM IST