తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరసిస్తూ కరీంనగర్లోని ఆయన ఇంటిని ముట్టడించారు. గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
'మంత్రి గంగుల ఇంటి ముట్టడి' - MINISTER GANGULA LATEST NEWS
కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.
'మంత్రి గంగుల ఇంటి ముట్టడి'