కరీంనగర్ జిల్లా కేంద్రంలో మస్తీ గోలీసోడాను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడు పోయే మస్తీ గోలీసోడాను కరీంనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించేందుకు అనుమతులు పొందారు.
మంత్రి గంగుల కమలాకర్ 'గోలీ'మార్.. - గోలీసోడా తాగిన మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు మస్తీ గోలీ సోడాను ప్రారంభించారు. అనంతరం దానిని తాగారు.
గోలీసోడా తాగిన మంత్రి గంగుల కమలాకర్
రసాయనిక పదార్థాలతో కాకుండా నేచురల్‌గా తయారు చేసే ఈ గోలీసోడాను ప్రతి ఒక్కరు తాగవచ్చని నిర్వహకులు తెలిపారు. ఐదురకాల్లో ఈ గోలిసోడాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ భూమగౌడ్ గోలీసోడాపై పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.