తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఆంధ్రా పార్టీల యత్నం: గంగుల - telanganan varthalu

తెలంగాణలో ఆంధ్రా పార్టీలు బలపడితే మన నీళ్లు, కరెంటు దోచుకుపోతారని మంత్రి గంగుల కమలాకర్​ ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు పొలాలకు పారకుండా అడ్డుకుంటారని మంత్రి అన్నారు.

మళ్లీ సమైక్య పార్టీలు అడుగుపెట్టేందుకు యత్నిస్తున్నాయి: గంగుల
మళ్లీ సమైక్య పార్టీలు అడుగుపెట్టేందుకు యత్నిస్తున్నాయి: గంగుల

By

Published : Feb 16, 2021, 10:07 PM IST

తెలంగాణలో మళ్లీ సమైక్య పార్టీలు అడుగుపెట్టేందుకు యత్నిస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీలు బలపడితే మన నీళ్లు, కరెంటు దోచుకుపోతారని ఆరోపించారు. కరీంనగర్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మళ్లీ సమైక్య పార్టీలు అడుగుపెట్టేందుకు యత్నిస్తున్నాయి: గంగుల

కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లు మన పొలాలకు పారకుండా అడ్డుకుంటారని మంత్రి గంగుల అన్నారు. కాంగ్రెస్, భాజపా పార్టీల అధిష్ఠానాలు దిల్లీలో ఉంటే... తెరాస అధిష్ఠానం హైదరాబాద్ గల్లీలో ఉందని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఉదండాపూర్ జలాశయ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి: భట్టి

ABOUT THE AUTHOR

...view details