తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Gangula: 'గుట్కా, తంబాకు తినాలంటే నాలుగు గోడల మధ్య తింటం' - Minister Gangula kamalakar updates

తాను గుట్కా తింటున్నట్లు వస్తున్న ఆరోపణలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తన మీద విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Minister Gangula
గంగుల కమలాకర్‌

By

Published : Jul 20, 2021, 7:45 PM IST

తాను ప్రగతి భవన్‌లో గుట్కా తింటున్నట్లు వస్తున్న ఆరోపణలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ (Bc Welfare Minister Gangula Kamalakar) తోసిపుచ్చారు. తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారని... అవి ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయన్నారు.

తనకు గుట్కా, సిగిరెట్, పొగాకు అలవాటు లేదని మంత్రి గంగుల అన్నారు. అలాంటి అలవాటు ఉంటే నాలుగు గోడల మధ్య సేవిస్తాము తప్ప... బహిరంగంగా సేవిస్తామా అని ప్రశ్నించారు.

నేనేమంటున్నా... నా మీద చాలా ఆరోపణలు వస్తుంటాయి. ఆరోపణలు ఆరోపణలుగానే ఉంటాయి. నాకు గుట్కా అలవాటు లేదు. సిగిరెట్ అలవాటు లేదు. తంబాకు అలవాటు లేదు. ఒకవేళ గుట్కా, తంబాకు తినాలంటే నాలుగు గోడల మధ్య తింటం... నిషేధితం కాబట్టి. బహిరంగంగా బయట ప్రెస్ ముందర బీఆర్​కే భవన్ ముందు తిన్నామంటే అది సోంపులో ఉన్న నాలుగైదు రకాల పప్పులు కాబట్టి చేతిలో నల్చుచుని తిన్న. దాన్ని స్క్రోలింగ్​లు పెట్టుకుంటే నేనేం చేస్త. జీవితంలో గుట్కా అలవాటు ఉందా నాకు? కొంతమంది నామీద అట్ల బండలెత్తుతుంటరు.

--- మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్

'గుట్కా, తంబాకు తినాలంటే నాలుగు గోడల మధ్య తింటం'

ఇదీ చూడండి:గంగుల సవాల్... కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు 'ఈటల' సిద్ధమా?

ABOUT THE AUTHOR

...view details