కరీంనగర్ జిల్లాలోని బద్దిపల్లి, మగ్ధూంపూర్ గ్రామాల్లో రైతు వేదికలను సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. తన సోదరుని జ్ఞాపకార్థం ఆ రైతు వేదికలను నిర్మించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి రైతు వేదికలకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులకు మంత్రి నియంత్రిత సాగు విధానం గురించి వివరించారు.
‘సొంత ఖర్చులతో రైతు వేదికలు నిర్మిస్తా’
సొంత ఖర్చులతో కరీంనగర్ జిల్లాలోని బద్దిపల్లి, మగ్ధూంపూర్ గ్రామాల్లో రైతు వేదికలను నిర్మిస్తానని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రతీ ఏడాది అకాల వర్షం వల్ల రైతులు పండించిన పంట నష్టపోతున్నారని మంత్రి అన్నారు. అందుకే ఈసారి మార్చిలోపు పంట పూర్తయ్యేలా ప్రభుత్వం నియంత్రిత పంట సాగు విధానం రూపొందించిందని తెలిపారు.
నియంత్రిత పంట సాగు వల్ల రైతులు అకాల వర్షానికి పంట నష్టపోవడం జరగదని అన్నారు. ఏప్రిల్ చివరి వారం లేదా.. మే మొదటి వారంలో రాళ్లవాన, గాలివాన వల్ల రైతులు పంట నష్టపోతున్నారని అన్నారు. అందుకే మార్చి కల్లా పంట చేతికొచ్చేలా ముఖ్యమంత్రి నియంత్రిత పంట సాగు విధానం రూపొందించారని మంత్రి తెలిపారు. జిల్లా రైతులు అధికశాతం వరి పంట వేసుకోవాలని.. రోహిణి కార్తె ముగియగానే.. రైతులు వర్షం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా.. చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:మండుతున్న ఎండలు