కరీంనగర్ జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొనుగోళ్లు, అమ్మకాలపై విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు బీసీ, పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అమ్ముతున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆస్పత్రులు ఎన్ని ఇంజెక్షన్లు కొనుగోలు చేశాయి.. వాటిని ఎవరికి వినియోగించారనే తదితర అంశాలను సమీక్షించేందుకు కమిటీ ఏకైక మార్గంగా భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం వచ్చే వారికి ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని కోరారు.
అక్రమాలను సహించేది లేదు..