మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ.. మాటల తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా గంగులను ఈటల హెచ్చరించారు. అధికారం శాశ్వతమనే భ్రమలో ఉన్నవాళ్లు.. 2023 తర్వాత అధికారంలో ఉండరని ఆక్షేపించారు. సాగర్‌లో లాగా హుజూరాబాద్‌లో గెలవాలని చూస్తే ప్రజలు పాతేస్తారని.. ఒకవేళ ఎన్నికలు వస్తే ప్రజలంతా తనకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.
మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల - gangula latest news
మాజీ మంత్రి ఈటల, మంత్రి గంగుల మరోసారి పరస్పర విమర్శలకు దిగారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా గంగులను ఈటల హెచ్చరించగా.. ఈటల బెదిరింపులకు భయపడే వారెవరూ లేరంటూ గంగుల దీటుగా సమాధానం ఇచ్చారు.
మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల
దీనికి మంత్రి గంగుల దీటుగా స్పందించారు. ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ ధ్వజమెత్తారు. రాజేందర్ కళ్లల్లో భయం కనబడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ఈటలకు సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: నేతల పరస్పర విమర్శలు.. బయటపడుతున్న తెరాస రహస్యాలు..!