ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు 66వ జన్మదిన వేడుకలను కరీంనగర్లో తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.
'సీఎం నిండునూరేళ్లు సల్లగుండాలె'
సీఎం పుట్టినరోజు వేడుకలను కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మంత్రి గంగుల కరీంనగర్ పట్టణ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.
'సీఎం నిండునూరేళ్లు సల్లగుండాలె'
అనంతరం సర్కస్ గ్రౌండ్లో మంత్రి గంగుల మొక్కలు నాటారు. కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్ నిండునూరేళ్లు సల్లగుండాలె.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు