కొవిడ్ సంక్షోభంలో పండుగలను సంతోషంగా జరుపుకోలేక పోతున్నామని మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్‌ను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెరాస ప్రభుత్వం అన్ని మతాలకు పండుగ కిట్లను అందిస్తోందని వివరించారు.
రంజాన్ కిట్లు పంపిణీ చేసిన మంత్రి గంగుల - ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ
మంత్రి గంగుల కమలాకర్.. కరీంనగర్ పట్టణంలో పర్యటించారు. రంజాన్‌ను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు.
రంజాన్ కిట్ల పంపిణీ
మతం ముసుగులో రాజకీయాలు చేసేవారిని పట్టించుకోవద్దని మంత్రి సూచించారు. కొవిడ్ రెండో దశ దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలతో వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష