రాష్ట్రంలో అభివృద్ది కోసం తండ్రి లాంటి కేసీఆర్ ఉన్నారని.. తమకు తెలంగాణ కోడలు అని చెప్తున్న వైఎస్ షర్మిల అసలే అవసరం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.
'ఆ విషయంలో షర్మిల అభిప్రాయం చెప్పాలి' - Gangula Kamalakar comments on Sharmila
రాష్ట్రంలో తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నడు.. కోడలు అవసరం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు. పోలవరం నిర్మాణం సమయంలో బలవంతంగా రాష్ట్రంలోని ఏడు మండలాలను లాక్కున్నారని అన్నారు. అవి తెలంగాణకు ఇప్పించే విషయంలో అభిప్రాయం చెప్పారలని వైఎస్ షర్మిలను మంత్రి గంగుల ప్రశ్నించారు.
'ఆ విషయంలో షర్మిల అభిప్రాయం చెప్పాలి'
తాను తెలంగాణ కోడలినని చెప్పి రాజకీయాలు చేస్తానంటున్న వైఎస్ షర్మిల ముందు పోలవరంపై అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో బలవంతంగా కలుపుకున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అక్కడి నుంచి ప్రారంభించి ఏడు మండలాలను ఇప్పించి రాజకీయ పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :ఛైర్పర్సన్ ఎమ్మెల్సీ ఓటుపై గందరగోళం