కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన ముగింపు సభకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. శాస్త్ర పరిశోధనలను విద్యార్థి దశలో అలవర్చటానికే జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన ఉపయోగపడుతుందని మంత్రి గంగుల అన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు విజ్ఞానం: గంగుల - Minister Ganguala kamalakar at science fair
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సైన్స్ ప్రదర్శన ముగింపు సభకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సైన్స్ ప్రదర్శనలో ప్రసంగించిన మంత్రి గంగుల
మన పూర్వీకులు నిత్య జీవితంలో పడిన సంఘర్షణతో విజ్ఞానం వికసించిందన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రతి దశలో సమాజం పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగంతో మంచిని పెంచుకోవాలి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పలువురు నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'దానికి కూడా హ్యాట్సాప్ చెబుతావా జగన్..'