కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి ఈటల రాజేందర్, జడ్పీ ఛైర్మన్ కనుమల్ల విజయ సందర్శించారు. ఆలయంలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొన్నారు.
పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి ఈటల - కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటల పర్యటన
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో మంత్రి ఈటల, జడ్పీ ఛైర్మన్ కనుమల్ల విజయ పర్యటించారు. నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో దేవతల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి ఈటల
ఆలయ ప్రధాన వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రిని శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.