కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని శివాలయాన్ని సందర్శించారు.
కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలి స్వామీ : ఈటల - maha shivratri
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శివాలయాన్ని సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
![కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలి స్వామీ : ఈటల minister etela rajender visited lord shiva temple in huzurabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10960275-982-10960275-1615442306265.jpg)
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
మంత్రి ఈటలకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన ఈటల.. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలని స్వామిని వేడుకున్నారు. మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ, తెరాస నాయకులు, కార్యకర్తలు మంత్రి ఈటల వెంట ఉన్నారు.