ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి, జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
'ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు' - huzurabad news
సన్నరకం ధాన్యానికి మంచి డిమాండ్ ఉందని... క్వింటాల్‌కు ధర రూ.2400 వరకు పెరిగిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్‌లో ఆయన పర్యటించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
గన్నీ సంచులు, హమాలీ కొరత లేకుండా చూశామని మంత్రి తెలిపారు. సన్నరకం ధాన్యానికి మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. క్వింటాల్‌కు ధర రూ.2400 వరకు పెరిగిందన్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుందని... రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు.
ఇదీ చూడండి:సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం