కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయ బతుకమ్మ సంబరాలను తిలకించారు. హూజూరాబాద్ నియోజకవర్గ స్థానిక నాయకులు మంత్రి ఈటలకు ఘన స్వాగతం పలికారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఈటల - Minister etela rajender participated Bathukamma festiva
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఏడాది వేడుకల్లో కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.
హుజూరాబాద్ సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్
మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్నారు. మహిళలంతా గౌరమ్మను పాటలతో అలరిస్తుండగా బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని మంత్రి ఈటల సంబురాల్లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది పండగకు కరోనా అంతం కావాలని మంత్రి ఈటల ఆకాక్షించారు. బతుకమ్మ పండగ సంబరాల్లో కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.