దేశంలోనే అత్యధికంగా 60లక్షల సభ్యత్వాలు కలిగి తెరాస రికార్డు సాధించిందని.. ఈసారి ఆసంఖ్య కోటికి చేరాలన్నదే తమ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
తెరాస సభ్యత్వాలు కోటికి చేరాలి: మంత్రి ఈటల - తెలంగాణ వార్తలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదును మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈసారి ఆ సంఖ్య కోటికి చేరాలని కార్యకర్తలకు సూచించారు.
ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి తగు గౌరవం ఇస్తామన్నారు. జరగరానిది జరిగితే పార్టీ ఆదుకునేందుకు వీలుగా ఈ సభ్యత్వం పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతను ప్రతిఒక్కరూ నెరవేర్చాలని.. సభ్యత్వాలను 15 రోజుల్లో పూర్తి చేయాలని కోరారు.
ఇదీ చూడండి:ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలి: సీఎస్