తెలంగాణ

telangana

ETV Bharat / state

'కడుపు మండితేనే కన్నెర్ర చేసి రోడ్డెక్కుతారు' - etela rajender visit jammikunta

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్​ పర్యటించారు. జమ్మికుంట క్లస్టర్​లో నిర్మించిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. రైతు రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఈటల స్పష్టం చేశారు.

minister etela rajender about farmers protest in jammikunta
minister etela rajender about farmers protest in jammikunta

By

Published : Feb 1, 2021, 5:37 PM IST

కడుపుమండితేనే రైతులు కన్నెర్ర చేస్తారని... రోడ్డుపైకి వస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి ఈటల పర్యటించారు. జమ్మికుంట క్లస్టర్​లో నిర్మించిన రైతు వేదికను మంత్రి ఈటలతో పాటు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ ప్రారంభించారు. కంప్యూటర్లు ఎన్ని వచ్చినా.. రైతు పంట పండించకపోతే కరువేనని మంత్రి తెలిపారు.

గోదావరి నీళ్లు మళ్లించి ఎండిన భూములను పచ్చగా మార్చిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కొనియాడారు. రైతు రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఈటల స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి భేషజాలకు పోకుండా కేంద్రం పరిష్కరించేందుకు ముందుకు రావాలన్నారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన... రైతుల చుట్టే తిరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం శ్యాం, మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ మమత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సబిత

ABOUT THE AUTHOR

...view details