కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని శివాలయాల్లో వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు. శివుడు పేద ప్రజలు కష్టాలను తీర్చే భోళా శంకరుడని అన్నారు.
'శివుడు పేద ప్రజల కష్టాలు తీర్చే భోళా శంకరుడు' - మంత్రి ఈటల రాజేందర్ తాజా వార్తలు
శివుడు పేద ప్రజల కష్టాలు తీర్చే భోళా శంకరుడని... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంటలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుకలకు... జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయతో కలిసి మంత్రి హాజరయ్యారు.
'శివుడు పేద ప్రజల కష్టాలు తీర్చే భోళా శంకరుడు'
ఆబాది జమ్మికుంటలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుకలకు... జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కనుమల్ల విజయతో కలిసి హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.26 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణ ఈ-సెట్ షెడ్యూల్ విడుదల