ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెరాస ప్రభుత్వం అన్ని మతాల సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలను పంచారు. క్రిస్మస్ ప్రజల్లో ప్రేమను పంచిందన్నారు.
ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్: మంత్రి ఈటల - కొవిడ్ నేపథ్యం
క్రిస్మస్ ప్రజల్లో ప్రేమను పంచిందని మంత్రి ఈటల పేర్కొన్నారు. పండగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
అందరి సంప్రదాయాలకు పెద్దపీట: మంత్రి ఈటల
కొవిడ్ నేపథ్యంలో కొన్ని నెలలుగా అనేక ఇబ్బందులు పడ్డామని మంత్రి పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ పండగలను జరుపుకోవాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని అక్కున చేర్చుకున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వమే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయించి వారిని స్వస్థలాలకు పంపించిందని వివరించారు.
ఇదీ చదవండి:సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శం: మంత్రి మల్లారెడ్డి