తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు' - telangana news

కేంద్రం రైతు విలువను మరిచిపోయి చట్టాలను చేయడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్​ విమర్శించారు. కరీంనగర్​ జిల్లా దుద్దెనపల్లి, రాయికల్​ గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలైనా, పార్టీలైనా ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేయొద్దని కోరారు.

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'
'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'

By

Published : Feb 18, 2021, 7:50 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి, రాయికల్ గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్​తో కలిసి ప్రారంభించారు. త్వరలోనే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాంతానికి సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. మానవులకే కాకుండా ప్రకృతిలో ఉండే సమస్థ జీవకోటికి అన్నం పెట్టేది రైతన్ననే అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదన్నారు.

సాఫ్ట్​వేర్​ కంపెనీలు, పరిశ్రమలు ఎంత మందికి ఉపాధి కల్పిస్తాయని, ఇవాళ నూటికి 90 కోట్ల మందికి అన్నం పెట్టేది, ఉపాధి కల్పించేది పల్లెలు, వ్యవసాయమేనన్నారు. రైతును మర్చిపోయి చట్టాలు చేస్తే మనకు మనమే కళ్లలో మట్టి కొట్టుకున్న వాళ్లమవుతామని పరోక్షంగా విమర్శించారు. ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలైనా ప్రజల మేలు కోసం, బాగు కోసం ఆలోచించాలి కానీ... ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు చేయొద్దని కోరారు.

'రైతు విలువను మరిచిపోయి చట్టాలు చేయడం సరికాదు'

ఇదీ చదవండి: ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్​లో రాష్ట్రం నుంచి 2 నగరాలు

ABOUT THE AUTHOR

...view details