కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పోలీసు సిబ్బంది, వాలంటీర్లు సుమారు 200 మొక్కలను నాటారు.
హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఏసీపీ కార్యాలయ ఆవరణలో మంత్రి మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి కాపాడాలని సూచించారు.
హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల
హరితహారం కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి ఈటల సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు వాసంశెట్టి మాధవి, ఎర్రల కిరణ్, ఎస్సై శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది