అన్యాయం జరిగిన రోజు రైతువేదికలే ప్రశ్నించే వేదికలుగా మారుతాయని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కందుగుల గిద్దెలో 22లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి.. గోదాముల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని నిలదొక్కుకుంటున్న తరుణంలో కొత్త చట్టాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయోనన్న ఆందోళన కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
రైతు వేదికలే ప్రశ్నించే వేదికలు: మంత్రి ఈటల - telangana varthalu
సీఎం కేసీఆర్ వందల గంటల సమయం రైతుల సంక్షేమం గురించి సమీక్షించేందుకు కేటాయించారని మంత్రి ఈటల అన్నారు. కరీంనగర్ జిల్లా కందుగుల గిద్దెలో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త చట్టాలతో అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పడితే తాను ఊరుకోనన్నారు.
రాష్ట్రప్రభుత్వాలు, రైతులను సంప్రదించకుండా కేంద్రప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చిన తరుణంలో తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తారా లేదా అనే అంశంపైనే రైతులు పోరాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కొత్త చట్టాలతో రైతులకు ఇబ్బందులు ఏర్పడితే ప్రజల మనిషిగా తాను నోరు మెదపకుండా ఉంటానని అనుకోవద్దని ఆయన రైతులకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని వందల గంటల సమయం రైతుల సంక్షేమం గురించి సమీక్షించేందుకు కేటాయించారని.. అన్నదాతలను కాపాడుకోవడానికి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని మంత్రి ఈటల రైతులకు భరోసా కల్పించారు.
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్