కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులను మంత్రి అందజేశారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్‌కు చెందిన 18 మందికి, జమ్మికుంటకు చెందిన 7గురు లబ్ధిదారులకు చెక్కులు మంజూరయ్యాయి.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి - karimnagar district news
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా లబ్ధిదారులకు మంత్రి ఈటల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు.
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
25 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల 2వేల 900 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులతో మంత్రి ఈటల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్లు గందె రాధిక, తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వలస కార్మికుల తరలింపుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు