కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్ మండలం కేసీ క్యాంపులో నూతనంగా నిర్మిస్తున్న మంత్రి క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనంలోని పలు విభాగాల నిర్మాణాల పనులను వీక్షించారు. భవనం చుట్టూ తిరిగి పనులపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడారు. భవన నిర్మాణ పనులను మరింతవేగంగా పూర్తి చేయాలన్నారు. త్వరలోనే భవనాన్ని ప్రారంభించుకుందామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయనవెంట నాయకులు, అధికారులు ఉన్నారు.
హజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కేసీ క్యాంపులో నూతనంగా నిర్మిస్తున్న మంత్రి క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
హజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన